కొండగట్టు అంజన్న మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, పుణ్యక్షేత్రం ఆయన ఫ్రస్టేషన్ లో ఉండి రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. నోరు ఉంది కదా అని మంత్రి పొన్నం ఏది పడితే అది మాట్లాడితే కెసిఆర్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. గతంలో కెసిఆర్ ఆంజనేయ స్వామి సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి మంత్రి పదవి పోయిందని అన్నారు. మంత్రి పొన్నం పోస్టు కూడా ఊస్ట్ అవుతుందని, కొండగట్టు అంజన్న స్వామి తో జాగ్రత్త అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అసలు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లో ఎంపీ అభ్యర్థి కరువైండణి అన్నారు. అందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్రస్టేషన్లో ఉండి పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎంపీ బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. రైతు భరోసా 15 వేలు ఇచ్చారా..? రెండు లక్షల రుణమాఫీ చేశారా..? కౌలు రైతులకు రైతు భరోసా అందించారా..? మహిళలకు రూ .2500 అకౌంట్లో వేశారా..? 4000 రూపాయల పింఛన్లు అమలు చేశారా..? అని ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ కూడా ఆరు గ్యారంటీల్లో భాగమేనని, వంద రోజుల్లో ఆర్ గ్యారంటీలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ దాదాపు 12 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేయించారని అన్నారు. వాటికి సంబంధించిన వివరాలతో ఓ పుస్తకాన్ని ముద్రించి ఇంటింటికి పంపిణీ చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆ పుస్తకాన్ని చదివితే బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. మంత్రి పొన్నంకు పుస్తకాన్ని పోస్టులో పంపిస్తామని, కళ్ళు సరిగా కనకబడకపోతే కళ్లద్దాలు పెట్టుకుని చదవాలని, లేకుంటే సహాయకులతో చదివించుకుంటే బండి సంజయ్ అభివృద్ధి పనులవిషయం అర్థమవుతుందన్నారు. మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఎంపీ బండి సంజయ్ పై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ, అక్రమాల్లో, అవినీతిలో కూరుకుపోయిన గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను, కేటీఆర్ ను, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత విషయాలపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. మంత్రి పొన్నంకు, కేటీఆర్ కు మధ్య బంధం ఉందనే కారణం తో మాట్లాడడం లేదని ప్రతిఒక్కరు అనుకుంటున్నారని అన్నారు. మంత్రి పొన్నం పనికిమాలిన రాజకీయాలు మానుకొని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై , అభివృద్ధి పనులపై దృష్టి పెడితే మంచిదని ఆమెఈ సందర్భంగా అన్నారు. మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళపు రమేష్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడమ సత్యనారాయణ రెడ్డి, జానపట్ల స్వామి, రాగి సత్యనారాయణ, బండ రమణారెడ్డి ,మామిడి రమేష్ , అవదుర్తి శ్రీనివాస్, పోరెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
