24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14
సిద్దిపేట జిల్లా:
భారత రాజ్యంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ స్వాప్నికుడు, న్యాయకోవిదులు, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని హరిజనవాడలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ పాండు గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ భారత దేశం ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తి తో మహానీయుని స్మరించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల బాబు, కర్రోళ్ళ రవి,దుబ్బసి మహేష్ , కర్రోళ్ల బాలకృష్ణ,సాయికిరణ్,మొద్దు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
