భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి
గజ్వేల్ నుండి భద్రాచలం బయల్దేరిన గోటి తలంబ్రాలు
శ్రీరామనవమి నాడు భద్రాచలంలో కన్నుల పండుగగ జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి గజ్వేల్ నుండి శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గోటి తలంబ్రాలను లక్షల మంది భక్తులచే పూర్తి చేయించి శనివారం నాడు అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రాచల దేవస్థానానికి బయల్దేరారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ 150కిలోల గోటి తలంబ్రాలకు శ్రీకారం చుట్టి లక్ష మంది భక్తులే లక్ష్యంగా ప్రతి భక్తునిలో రామభక్తిని మేల్కొలిపి గోటి తలంబ్రాలలో పాలు పంచుకునేలా చేశామన్నారు. సోమవారం నాడు భద్రాచల దేవస్థాన అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.





