జర్నలిస్టుల పిల్లలకు
ప్రైవేటు విద్యాసంస్థల్లో 100% ఫీజు రాయితీ కల్పించాలి
–తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్
–తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 100% ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్ మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ ప్రైవేటు విద్యాసంస్థల్లో కల్పిస్తామని చెప్పి పది సంవత్సరాలు అయిన అమలు చేయలేదని అన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు గడుస్తున్న జర్నలిస్టుల సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు .ఇప్పటికైనా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇల్లు జర్నలిస్టుల సంక్షేమానికి నిధుల కేటాయింపు తో పాటు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 100% ఫీజు రాయితీ కల్పించాలని అదేవిధంగా ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రుల్లో 75% ఫీజు మాఫీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు .పెద్దపెల్లి జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి ముఖేష్ జిల్లా ఉపాధ్యక్షులు కన్నూరి అంజి మిగతా జర్నలిస్టులు పాల్గొన్నారు.





