నేడు కార్యకర్తల సమావేశంను విజయవంతం చేయాలి
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట ఏప్రిల్ 13
–బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య
జగదేవ్పూర్ : నేడు అనగా ఆదివారం 14-04-2024 రోజున మధ్యాహ్నం 1:00 గంటలకు జగదేవపూర్ మండల కేంద్ర లోని “కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి” ఫంక్షన్ హాల్ లోమండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందని బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు దాచారం కనకయ్య పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రి హరీష్ రావు , మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాo రెడ్డి .మాజీ ఎంపీకొత్త ప్రభాకర్ రెడ్డి . ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాజీ ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి లు హాజరు అవుతారని తెలిపారు. ఈ సమావేశానికి మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు
పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశం ను విజయవంతం చేయగలరని కోరారు.
