*మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో బతద్రవ ఆలయ దర్శనానికి అనుమతి నిరాకరణ మరియు శ్రీమంత శంకర్ దేవ్ చౌక్ దగ్గర పాదయాత్రను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబెడ్కర్ విగ్రహం దగ్గర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు,మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






