మంత్రి కేటీఆర్ ను కలిసిన ఏఎంసీ పాలకవర్గం
fso 1212 ఎల్లారెడ్డిపేట:
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్ తో పాటు పాలకవర్గం మంత్రి కేటీఆర్ ను శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ అమెరిక పర్యటన ముగించుకొని వచ్చాక నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హైదరాబాదు తీసుకెళ్లి మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కల్పించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి విధి నిర్వహణ పట్ల క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పాల్గొన్నారు.
