బోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు
జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట :
బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అంది సుభాష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు సీత నాయక్, ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ యశ్వంత్, వార్డు సభ్యులు తిరుపతి పాల్గొన్నారు.
