ఎల్లారెడ్డిపేట మండలం చెందిన వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకోగా అతని ఫిర్యాదు మేరకు సెల్ఫోన్ వెతికి బాధితునికి అప్పగించడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ అన్నారు. మండలంలోని అల్మాస్పూర్ గ్రామానికి చెందిన ఉచ్చిడి పవన్ కుమార్ ఫిబ్రవరి 21వ తారీఖున సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ ఫోన్ వెతికి గురువారం రోజు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే మాకు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ అన్నారు.
