Breaking News

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ…..

252 Views

నలుగురికి తీవ్ర గాయాలు

( శంకరపట్నం మండలం సెప్టెంబర్ 24)

ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని నలుగురికి తీవ్ర గాయలైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ శివారులోని ఆదివారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 46 మంది ప్రయాణికులతో వరంగల్ నుండి నిజామాబాద్ కు వెళ్తుంది.ఈ క్రమంలో బస్సు తాడికల్ గ్రామ శివారులోకి రాగానే కరీంనగర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో 16 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

స్థానికుల ధ్వారా విషయం తెలుసుకున్న కేశవపట్నం ఎస్.ఐ పాకాల లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు ..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *