తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 09
తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రాజరామ్మోహన్ రెడ్డి దంపతులు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు,నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా డా, అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి చే గణింపబడిన శ్రీ చండీ పరమేశ్వరి పీఠం పంచాంగం, పంచాంగ డైరీ ఆవిష్కరణ చేసి అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం తొర్రూరు లోని వారి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులతో కలిసి ఉగాది వేడుకలు నిర్వహించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు, మహిళ నాయకులు, యూత్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.
