ప్రాంతీయం

బీసీ సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి

104 Views

చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో కాంగ్రెస్ నాయకుడు బీసీ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొమ్ము ఉమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్ము ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమ, తెగువతనంతో అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు, తెలంగాణ ఉద్యమకారిణి, వీరవనిత అని, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి అని ,చాకలి ఐలమ్మ లాంటి పోరాట పటిమ నేటి సమాజానికి స్పూర్తి దాయకం అని అన్నారు ,ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల యాదవ సంఘం అధ్యక్షుడు కన్నా యాదవ్, మర్కుక్ మండల రజక సంఘం నాయకుడు ఎర్రబాగు రఘుపతి,దొమ్మాట కనకయ్య రజక, గౌడ సంఘం నాయకుడు మామిడి సురేష్ గౌడ్,నాయకులు అన్నోజి శ్రీనివాస చారి, హరికృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్, కొంగళ్ళ వేణు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found