Breaking News

సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు

198 Views

వాటర్ ట్యాంక్ లో కోతులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు

నాగార్జునసాగర్ టౌన్:- ఏప్రిల్ 9

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో గత బుధవారం మూడవ తారీకు వెలుగు చూసిన వాటర్ ట్యాంక్ లో కోతులు మృతిచెందిన సంఘటన పై సమగ్ర విచారణ కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పౌర మానవహక్కులు, పారా లీగల్ వాలంటీర్, ఆర్టిఐ యాక్టివిస్ట్ ,ప్రజా వేగు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కన్నె కంటి క్రాంతి కుమార్ ఫిర్యాదు చేశారు, త్రాగునీటి ట్యాంకులో కోతుల మృతిపై ప్రజా ఆరోగ్యం విషయంపై నల్లగొండ డిఎంహెచ్వో ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరారు, వన్యపాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అటవీశాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన 30 నుంచి 40 కోతుల మృతదేహాలకు వైద్య పరీక్షలు నిర్వహించకుండా పోస్టుమార్టం చేయనందుకుగాను సంబంధిత శాఖ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు షో కాస్ నోటీసులు జారీ చేయాలని కోరినట్లుగా ఆయన తెలిపారు, ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కలెక్టర్ ను ఈ సందర్భంగా కోరినట్లు క్రాంతి కుమార్ తెలిపారు, ఈయన వెంట ప్రజావేగు సభ్యులు ఆర్టిఐ డిఎల్ఎస్ఎ శివశంకరాచారి, ప్రజా వేగు సంఘ సభ్యులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found