ముస్తాబాద్, ఏప్రిల్ 9 (24/7న్యూస్ ప్రతినిధి): క్రొదినామ తెలుగు సంవత్సరము ఉగాది పండగ సందర్భంగా శివకేశవ ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ ఎలుసాని దేవయ్య ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణము గ్రామ ప్రజలుకు ఆలయ ప్రధాన అర్చకులు హరీష్ పంతులు ఈసారి కాలం విశేషాలు ప్రస్తావించారు. తదుపరి ఒగ్గుకథ తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో, ఆయురారోగ్యలతో అష్ట ఐశ్వర్యాలతో భాగుండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ గ్రామ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
