ముస్తాబాద్, జూలై 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రములో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశ్రీను పర్యటనలో భాగంగా చీకోడ్ గ్రామానికి చెందిన బాధనరేష్ గున్నాల రమేష్ గౌడ్ కలిసి స్థానికంగా చీకోడు గ్రామం నుండి రేకులకుంట మల్లికార్జున దేవస్థానం వరకు రోడ్డు నిర్మాణ కొరకు ప్రభుత్వ విప్ కు వినతిపత్రం అందించారు. సుమారుగా 400 సంవత్సరాల క్రితం స్వయంభుగా కొలువై ఉండి ఉమ్మడి కరీంనగర్ నిజాంబాద్ మెదక్ హైదరాబాద్ జిల్లాలే కాకుండా పలు జిల్లాల ప్రజలచే పూజలు అందుకొని భక్తులు కొంగుబంగారమై విరసిల్లుచున్నది కాగా అప్పటినుండి భక్తులు ఈ దారియే ప్రధానంగా ఉండేది కొద్ది సంవత్సరాలక్రితం ఆ మార్గంలో సోలార్ ప్లాట్ నిర్మాణం కావడంవల్ల రోడ్డుమార్గం మార్చడం వలన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. కావున తిరిగి రోడ్డు నిర్మాణం గావించి భక్తుల సమస్యను పరిష్కరించగలరని విన్నవించారు. వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.కార్యక్రమంలో బాధ నరేష్ గున్నాలా రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




