ప్రాంతీయం

ఓటు హక్కు అందరు వినియోగించుకోవాలి

85 Views

మంచిర్యాల జిల్లా

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి-ఎస్సై జగదీష్ గౌడ్.

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు అభద్రతకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి వారిలో భరోసా కల్పించడానికి తాండూర్ మండల కేంద్రంలోని రేచిని గ్రామంలో శుక్రవారం సిఆర్పిఎఫ్ బలగాలతో రేచిని గ్రామ వీధులలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై జగదీష్ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఎక్కడైనా సమస్యాత్మక ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపడానికి నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్,కానిస్టేబుల్ తిరుపతి,సంతోష్ ,లక్ష్మణ్ ,స్వామిదాస్ ,పోలీసులు,సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్