దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తోపాటు ఆయా గ్రామాల్లో శ్రావణమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శ్రీశ్రీశ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు గండ దీపాలతో మొక్కులు తీర్చుకున్నారు.
