తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు డివిజన్ ప్రతినిధి) ఏప్రిల్ 05
*విలేఖరి పై లాఠీచార్జి*
*చేతులు విరగొట్టి, అక్రమ కేసులు*
– *లాకప్ లో వేసి, చిత్రహింసలు*
- మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్సై గండ్రతి సతీష్ అకారణంగా విలేకరి అయిన మేకరబోయిన నాగేశ్వర్,అతని తమ్ముడు బ్రహ్మేష్ ను చితకబాదిన సంఘటన పై గురువారం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. నర్సింహులపేట ఎస్సైగా పనిచేస్తున్న గండ్రాతి సతీష్ గత నెల 15వ తేదీన రాత్రి 10:30 నుండి 1 గంట సమయం వరకు నర్సింహులపేట పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న మేకరబోయిన నాగేశ్వర్, అతని తమ్ముడు బ్రహ్మేష్ ను ఎస్ఐ సతీష్ అకారణంగా కొట్టి గాయపరిచాడు. నర్సింహులపేట నుండి పడమటిగూడెం వెళ్లే రోడ్డు వద్ద నర్సింహులపేట నర్సరీ వద్ద తీవ్రంగా కొట్టడంతో పాటు పోలీస్ స్టేషన్ లాక్ అప్ లో వేసి,మళ్లీ తీవ్రంగా కొట్టి చేతులు విరగొట్టి, వారిపై అక్రమ కేసులు పెట్టినందున, బాధితులు ఈ నెల 4 న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్ (డబ్ల్యూ. పి. నెం.) 9028/2024 ప్రకారం చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకొని లాక్ అప్ లో వేసి,చితకబాది ఇరువురిని గాయపరిచిన ఎస్ఐ సతీష్ పై పోలీస్ అధికారులకు తెలపకుండా పోలీస్ లాకప్ లో వేసి, చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితులు తెలిపారు. జిల్లా, డివిజనల్ స్థాయి పోలీస్ అధికారులు స్పందించకపోవడంతో ఈ మేరకు హైకోర్టు..రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, డీజీపీ, ఐజిపి, డిఐజి, ఎస్పీ, ఎస్ఐ గండ్రతి సతీష్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన ఆయా పోలీస్ అధికారులు పూర్తి నివేదికతో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.




