కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డికి సన్మానం సోషల్ మీడియా సభ్యులు
4/ఏప్రిల్ నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవిదర్ రెడ్డి నివాసంలో టిపిసిసి మండల అధ్యక్షుడు కుమార్ ఆధ్యర్యంలో జరిగిన వివిధ గ్రామాల నూతనంగా ఎన్నికైన సోషల్ మీడియా విలేజ్ కో. అర్టినర్ల ముఖ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కత్తి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్క విలేజ్ సోషల్ మీడియా కో. అర్టినర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో కాకుండా రానున్న ఎన్నికలలో సర్పంచ్,వార్డు మెంబర్, జడ్పిటిసి, లకు పోటీ చేయాలని అన్నారు. మీ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సర్పంచ్ తో మీరు సమానం అని ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల టీపీసీసీ సోషల్ మీడియా కో అర్టినర్లు పాల్గొన్నారు.
