Breaking News

10 వేల రూపాయల ఆర్థిక సహాయం

108 Views

వీరాసింగ్ కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఆపద్బాంధవుడు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త

ఏప్రిల్ 4. శివంపేట మండలం మెదక్ జిల్లా

మండలంలోని నవాబ్ పేట గ్రామపంచాయతీ పరిధిలోని రాములు తండాలో ఇటీవలే మరణించిన పాల్త్య వీరాసింగ్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు. జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త గురువారం తన స్వంత డబ్బులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

ఈసందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ చిన్న వయసులో వీరాసింగ్ మరణించడం బాధాకరమని ఆయన కుటుంబానికి మరింత అండగా ఉంటామన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ ప్రేమ్ దాస్, సీనియర్ నాయకులు రంగ సురేష్ గౌడ్, రంగ మహేష్ గౌడ్,గోవర్ధన్ రెడ్డి, భాస్కర్ నాయక్, సరోజ నాయక్,తండా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found