లిటిల్ స్టార్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
విద్యార్థులే ఉపాధ్యాయులు
ఏప్రిల్ 04, కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని స్థానిక లిటిల్ స్టార్, పాఠశాల యందు గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది.
స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వర్తించారు.కలెక్టర్ సుజల్,డీఈవో వెంకట్,ఎంఈఓ విజయ్, ప్రధాన ఉపాధ్యాయులు వినోద,ఉపాధ్యాయులై బాధ్యతలు నిర్వర్తించి ప్రతి తరగతుల్లో చక్కగా బోధనలను బోధించారు.
అనంతరం చిన్నారులు చక్కటి సాంస్కృతిక నృత్య,నాట్య, ప్రదర్శనలు ప్రదర్శించి, సంరక్షకులకు, గ్రామస్తులకు, ఆకట్టుకునే దిశగా సంస్కృతిక, ఆటపాటలతో,ఆడి పాడి చిందేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్,సుధీర్, అనిల్,జగన్,ప్రశాంత్, రవీందర్,హేమలత, మౌనిక,సరిత, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
