నర్సన్నపేట సీఎం దాత్తాత గ్రామంలో బి జె పి ఇంటింటి ప్రచారం
నవంబర్ 17
మార్కుక్ మండలం నర్సన్నపేట సీఎం దాత్తాత గ్రామంలో మార్కుక్ మండల్ ఇంచార్జ్ మాజీ జడ్పీటీసీ సింగం సత్తయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అతిథిగా ఈటెల రాజేందర్ కోడలు క్షమిత, ప్రచారంలో పాల్గొన్నారు. గడపగడపకు ప్రచారం చేస్తూ బిజెపి మ్యానిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ ఈటల రాజేందర్ కు మద్దతు గా పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. మాట్లాడుతూ పల్లె పల్లెలలు అభివృద్ధి చెందాలంటే బిజెపి వల్లనే సాధ్యమవుతుందని అన్నారు.
మార్కుక్ మండల్ అధ్యక్షులు రమేష్ గుప్త, ఉపాధ్యక్షులు రాజేందర్ సింగ్,మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, ప్రస్తుత ఎంపీటీసీ చైతన్య శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఈటల రాజేందర్ గెలిపించుకుంటామని కాంగ్రెస్ బిఆర్ఎస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల ఉపాధ్యక్షులు రాజేందర్ సింగ్, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, ఎక్స్ ఎం పి టి సి నర్సింలు
కొమురయ్య, నర్సింలు దామరకుంట గ్రామ అధ్యక్షులు రాజు యాదవ్ బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ సత్యనారాయణ, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కుంట సత్యం,మోర్సు కిషోర్ రెడ్డి, తాడూరి మహేష్ గౌడ్, పెంటయ్య రాజు చంద్రం కృష్ణమూర్తి పెంట రెడ్డి ద్యప మహేష్ తదితరులు పాల్గొన్నారు.





