డాక్టర్ బిఆర్ అంబేద్కర్,133 వ జయంతి ఉత్సవాల పోస్టర్స్ ఆవిష్కరణ
తడ్కల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్,సంఘం
,ఏప్రిల్ 03 కంగ్టి
సంగారెడ్డి జిల్లా తడ్కల్ నూతన మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,విగ్రహం వద్ద బుధవారం బిఆర్ అంబేద్కర్,133 వ జయంతి ఉత్సవాల పోస్టర్స్ ను తడ్కల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్,సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్,సి,ఎస్ఎస్,మండల అధ్యక్షులు ముత్యాల సాయిలు మాట్లాడుతూ విశ్వ రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,ఏప్రిల్ 14న 133 వ జయంతి ఉత్సవాలు నూతనంగా ఏర్పడిన తడ్కల్ మండలంలో షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విశ్వరత్న డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14,ఆదివారం రోజున కళాకారుల బృందంచే ఆటపాటలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
అంబేద్కర్, జయంతి ఉత్సవ కార్యక్రమానికి తడ్కల్,కంగ్టి,పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్, జయంతి ఉత్సవ సభను విజయవంతం చేయాలని ఇరు మండలాల గ్రామాల ప్రజలకు సవినయంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోతుల సంజీవులు,ప్రధాన కార్యదర్శి గైని మారుతి, గైని జైపాల్,కేసరి గోపాల్,బైదొడ్డి సాయిలు, శ్రీపతి,గంగారం,రిపోర్టర్ జలీల్,బీమయ్య,రాజు, బూమన్న,తదితరులు పాల్గొన్నారు.
