–బండి ని విమర్శించే హక్కు పొన్నం కు లేదు.
–బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మినారాయణ.
(తిమ్మాపూర్ ఏప్రిల్ 03)
మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ ఆరోపించారు.రైతాంగానికి ఎదురవుతున్న కష్ట,నష్టాల విషయంలో మద్దతుగా ఉండాలనే రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గ్యారంటీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటనలు చేస్తూనే రైతులకు బ్యాంకు లు నోటీసులు పంపించడం దారుణమని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని రేపూ మాపంటూ వాయిదాలు వేస్తుందని అన్నారు.వరి పంటకు 500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.కౌలు రైతులకు ఇచ్చే పెట్టుబడి గురించి ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. రైతులకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ బండి సంజయ్ చేసిన దీక్ష తో పార్లమెంట్ పరిధిలోని రైతులు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తూ స్థాయిని తగ్గించుకుంటున్నాడని అన్నారు. కరీంనగర్ లో పోటీ చేసే దైర్యం లేక హుస్నాబాద్ వెళ్లి పోటీ చేసి స్థానిక కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేసాడని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధిలో బండి సంజయ్ నిధుల విషయంలో కాంగ్రెస్ నాయకులకు, పొన్నం అనుచరులకు చర్చకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా రైతుల పక్షాన ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.
మాజీ జడ్పిటీసి ఎడ్ల జోగిరెడ్డి, మాజీ ఎంపీపి దొంగల రాములు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర,కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కరివేద మహిపాల్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాపాక ప్రవీణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, పబ్బ తిరుపతి, బామాండ్ల రాజు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.