ముస్తాబాద్, జనవరి 24 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులకు నాణ్యమైన విద్యుత్ అందాలని మండలంలొ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సందుపట్ల అంజిరెడ్డి మాట్లాడుతూ అవునూర్, కొండాపూర్ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించామని తెలుపుతూ అదేవిధంగా రైతులపట్ల మావంతు కృషి చేస్తానని అంతేకాకుండా తదితర గ్రామాలలో విద్యుత్ ద్వారా అంతరాయం కలుగకుండ త్వరితగతిన మరిన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండం నరసయ్య, సర్పంచులు బద్ది కళ్యాణి, లక్ష్మి, దమ్మరవీందర్ రెడ్డి, కర్ణాకర్ లు తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు.
