తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి
సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 3
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని (టౌన్) అంబేద్కర్ విగ్రహం వద్ద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి (బి డి ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, సాడిమేల డేవిడ్ మాట్లాడుతూ
హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణా సాయుధ పోరాటంగా పిలుస్తారు.
విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ఈమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది.
వెట్టి చాకిరి కి దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాన్ని ప్ర్ర్రజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో సంఘమేర్పడింది. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా అయింది. వెట్టచాకిరిని నిర్మూలించారు. దొరలు, విసునూర్ ల ఆటలను అరికట్టించారు. ఈ కార్యక్రమంలో బి డి ఎస్ ఎఫ్ నాయకులు గాలి, రాజేష్. అభిషేక్, రాజు (బహుజన కార్మిక సంఘాల సమైక్య) సిద్దిపేట జిల్లా కన్వీనర్ శివరాత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
