ప్రాంతీయం

సమాజ నిర్మాణానికి సేవే మార్గం

79 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 02

 

ప్రతి ఒక్కరూ సమాజంలో సామాజిక సేవే బాధ్యతగా సేవ కార్యక్రమాలు నిర్వహించాలి

-ఘనంగా తొలి అక్షరం తెలుగు దినపత్రిక రాష్ట్ర బ్యూరో,అనువంశిక ఆయుర్వేదిక్ వైద్యుడు పస్తం సాంబ జన్మదిన వేడుకలు

-తొలి అక్షరం తెలుగు దినపత్రిక చైర్మన్,ఎడిటర్ సినియర్ రిపోర్టర్ పస్తం సైదులు

జన్మదిన వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ సమాజంలో సామాజిక సేవే బాధ్యతగా సేవ కార్యక్రమాలు నిర్వహించాలని తొలి అక్షరం తెలుగు దినపత్రిక చైర్మన్,ఎడిటర్ సినియర్ రిపోర్టర్ పస్తం సైదులు పిలుపునిచ్చారు.మంగళవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలో పస్తం సాంబ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో తొలి అక్షరం తెలుగు దినపత్రిక రిపోర్టర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో,అనువంశిక ఆయుర్వేదిక్ వైద్యుడు పస్తం సాంబ విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రి ప్యాడ్ లు పెన్నులు పంపిణి చేశారు.అనంతరం మెట్రో ఉదయం రిపోర్టర్ కొండ్లే ఉమేష్ అధ్యక్షతన జర్నలిస్టుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పస్తం సాంబ కేక్ కట్ చేసారు.ఆయన హాస్టల్ ఆవరణంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పస్తం సాంబ మాట్లాడుతూ.. పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కని నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.అలాగే విద్యార్థులను ప్రోత్సహించాలని కోరడం జరిగింది.అనంతరం కొండ్లే ఉమేష్ మాట్లాడుతూ.. పస్తం సాంబ ప్రతి సంవత్సరం తన జన్మదిన వేడుకల సందర్భంగా మొక్క నాటడం జరుగుతుందని తెలిపారు.రిపోర్టర్ గా పనిచేస్తూ..తన తండ్రి సీనియర్ రిపోర్టర్ పస్తం సైదులు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నాడని కొనియాడారు.వంశపారంపర్యంగా ఆయుర్వేదిక్ వృత్తిని మరవకుండా ఆయుర్వేదిక్ వైద్యాన్ని తక్కువ ధరలో అన్ని జబ్బులకు తనక వంతు ప్రజలకు సేవ చేస్తున్న సాంబ సేవలు గొప్పవన్నారు.ఎంతో మందికి తగ్గని వ్యాధులకు కూడా ఆయుర్వేదిక్ వైద్యం ద్వారా జబ్బులను తగ్గిస్తూ జిల్లా లో తనకంటూ గుర్తింపుని తెచ్చుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.అనారోగ్యంతో ఎవరికి ఏ సమస్య ఉన్న సాంబ ను సంప్రదిస్తే తన అనువంశీ అనుభవం తో ఆయుర్వేదం ద్వారా వ్యాధిని తగ్గిస్తాడన్నారు.సంప్రదించవలసిన నెంబర్ 7738414766

ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లాలోని వివిధ మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్