రాజకీయం

కెసిఆర్ పొలం బాట వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు తిరిగినట్టుంది

199 Views

కెసిఆర్ పొలం బాట
వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు తిరిగినట్టుంది

ఫోన్ ట్యాపింగ్ , కాలేశ్వరం నాణ్యతలేని నిర్మాణంలపై ప్రజల కు బహిరంగ క్షమాపణ చెప్పక తిరుగుతే మీరు విపలమే

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ ఓక్క సీటుకూడా గెలువదు

బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య,

ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 02 ;

రైతుల పైన మెసలి కన్నీరు కారుస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పొలంబాట ఎట్లున్నదంటే “వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు తిరిగినట్లు ఉందని” బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మట నరసయ్య తీవ్రంగా విమర్శించారు,
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయాంలో పంటలు ఎండిపోతే 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కు కనీసం పావులా,,,, రూపాయన్న ఇచ్చిండా ,,,,,వడగల్లా వాన పడి పూర్తిగా ద్వంసమై పాడైపోయి నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదని ఏ మోహాం పెట్టుకొని నష్ట పరిహారం ఇవ్వాలని పొలం బాట పట్టావని కెసిఆర్ ను ఆయన ప్రశ్నించారు,
పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు కూడా బిఆర్ ఎస్ పార్టీ కి వచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో కెసిఆర్ పొలంబాట పట్టి పొలాల్లో తిరుగుతున్నాడని కేసీఆర్ ఎన్నిసార్లు తిరిగిన ఎన్ని ఎత్తిగడ్డలు ఎన్ని వేషాలు బాగోతాలాడిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు, పగటిపూట బాగోతాలను బంద్ చేసి ఇప్పటికైనా మీరు చేసిన తప్పులను ప్రజల ముందు నిజాయితీగా ఒప్పుకొని ఫోన్ ట్యాపింగ్ , కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం పై ప్రజల ముందు బహిరంగ క్షమాపణలు చెబితే కెసిఆర్ తమ కోసం నిజంగానే తిరుగుతున్నాడని రైతులు హార్షిస్తారేమో గాని ఇట్ల తిరుగుతే విఫలమేనన్నారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఉపాధ్యక్షులు పందిళ్ళ లింగం గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , గంట బుచ్చా గౌడ్ తదితరులు పాల్గొన్నారు,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7