బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. పదవులు ఉన్నా లేకున్నా. నిత్యం ప్రజల మధ్యలో ఉండే మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు ఫారుక్ హుస్సేన్ జన్మదిన వేడుకలను బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో ఉమ్మడి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి దౌల్తాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకింది మంజూర్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లో పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ పదవి ఉన్న లేకున్నా నియోజకవర్గ ప్రజల మధ్యన ఉన్న ఫారుక్ హుస్సేన్ అని ఆయన పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పాత దొమ్మట నియోజకవర్గంలో నుండి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారన్నారు. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని ఆయా గ్రామాల్లో నిరుపేదలకు ఫారుక్ హుస్సేన్ చేపట్టిన సామాజిక సేవ కార్యక్రమాలు. నిరుపేదలను ఆదుకోవడం ఆయన చేపట్టిన సేవలు ఎంతో గొప్ప అన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా నిరుపేద సంక్షేమ లక్ష్యంగా ఫారుక్ హుస్సేన్ చేపట్టిన పనులు నేటికీ ప్రజల హృదయాల్లో ఇప్పటివరకు గుర్తింపు ఉందన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా మున్ముందు మరిన్ని పదవులు చేపట్టి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్, ఉద్యమకారుడు మాదాసు మురళి గౌడ్,మాజీ ఏఎంసీ డైరెక్టర్ మాసాన్ పల్లి రాజు,మండల నాయకులు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నాయకులు ఊషనగళ్ళ స్వామి ,కరుణాకర్,జనార్దన్ రెడ్డి,స్వామి,ప్రవీణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




