మహాజనసభ..
ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ సంఘ భవన నందు నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం నందు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
సభలో చర్చించిన అంశాలు :-
తేదీ: 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది.
సభ్యులకు గల సందేహాలను మరియు వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి చేశారు. సర్వేపల్లి గ్రామంలో నిర్మించిన డీజిల్&పెట్రోల్ బంకు త్వరలో పునః ప్రారంభించబోతున్నామని ఈ సందర్భంగా చైర్మన్ గారు తెలియజేశారు. ఎల్లారెడ్డిపేట సహకార సంఘంనకు టేస్కాబ్ ఛైర్మెన్ శ్రీ కొండూరి రవీందర్ రావు
సహకారంతో పెద్ద ఎత్తున దీర్ఘకాలిక రుణాలు మరియు స్వల్పకాలిక రుణాలు, మంజూరు చేశామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
భవిష్యత్తులో కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా రైతులకు సేవలందించాలనుకుంటున్నామని అన్నారు, అలాగే బంగారు ఆభరణాలపై రైతులకు రుణాలను అందించాలని అనుకుంటున్నామని అన్నారు,
సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, డైరెక్టర్లు దొమ్మాటి నర్సయ్య, గండ్ర ప్రభాకర్ రావు, గోట్టే సరిత, గోగూరి ప్రభాకర్ రెడ్డి, కస్తూరి రామచంద్రారెడ్డి, కనకట్ల సుధాకర్, కోనేటి ఎల్లయ్య, నేవూరి వెంకట నరసింహారెడ్డి,
అలాగే వివిధ గ్రామాలసంఘ సభ్యులు:-దమ్మ భూమి రెడ్డి, బ్రహ్మ చంద్రారెడ్డి, చకినాల లక్ష్మణ్, లదునూరి రామదాసు, కోల కొండయ్య, నేవూరి పద్మా రెడ్డి, గుండాడి రాంరెడ్డి, గుండారపు వెంకటరెడ్డి, తుమ్మల శ్రీనివాస్, ఒగ్గు బాలరాజు, మల్లారం రామకృష్ణారెడ్డి, శ్రీధర సత్యనారాయణ, మాదారం నారాయణ, మాదారం శ్రీనివాస్, బొమ్మనవేణి నారాయణ, మంద కిష్ట రెడ్డి, అంబురి బాబు,
సంఘ సెక్రటరీ కిషోర్ కుమార్,
సంఘ సిబ్బంది, వివిధ గ్రామాల సభ్యులు పాల్గొన్నారు.
