Breaking News

విజయవంతంగా విద్యాసంస్థల బంద్*

276 Views

*విజయవంతంగా విద్యాసంస్థల బంద్*

*మండల కేంద్రంలో విద్యార్థుల మానవహారం*

*దూల్మిట్ట.*. చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట మండలాలను కలిపి చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ, మండల వ్యాప్తంగా విద్యాసంస్థల ప్రభుత్వ మరియు ప్రైవేటు బంద్ నిర్వహించడం జరిగింది. అనంతరం మండల కేంద్రంలో విద్యార్థుల తో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతం అస్తిత్వం స్థానికత అభివృద్ధి కోసం ప్రజలు సంఘటిత ఉద్యమంలోకి, కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ, మన ప్రాంత ఆశయ సాధనకు ప్రజలందరూ ముందుకు రావాలని తెలియజేస్తూ, డివిజన్ ప్రకటించకపోతే భవిష్యత్తులో ఉద్యమం తీవ్ర తరం చేస్తామని తెలియజేశారు.

కార్యక్రమంలో జేఏసీ చేర్యాల నియోజకవర్గ నాయకులు చెట్కూరి కమలాకర్, గద్దల మహేందర్ మండల కన్వీనర్ బండి చంద్రయ్య, కో కన్వీనర్ సుందరగిరి భాస్కర్, మండల జేఏసీ నాయకులు గోనపల్లి రమేష్, సాగర్ గౌడ్, రాజు, అనిల్ నితీష్ మహిపాల్ విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *