తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 27
???? *ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించిన అధికారులు*
???? *రాయితీ ప్రకటనతో వసూల్ పై ఆశలు*
???? *నేటి నుండి ఆస్తులు జప్తు*
???? *మున్సిపల్ కమిషనర్ పి. శాంతి కుమార్*
తొర్రూర్ మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్ అన్నారు. బుధవారం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా ఆస్తి పనుల వసూలు పై స్టేట్ వైడ్ గా పేరుకుపోయిన బకాయిల పైన సీరియస్ గా ఉన్నందున పన్నుల వసూలు 100% లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొర్రూరు పట్టణంలోని పేరుకుపోయిన బకాయి వసూలు మొండిపద్దులు ఉన్నాయని రేపటినుండి వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని, బకాయి దారులు తమ ఆస్తి పన్ను చెల్లించి మున్సిపాలిటీకి సిబ్బందికి సహకరించగలరని అన్నారు. 2023 -24 సంవత్సరానికి గాను భారీగా పేరుకుపోయిన ఆస్తి పన్ను దారులకు నోటీసులు ఇచ్చిన వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం వలన నేటి నుండి వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందని పేరుకుపోయిన బకాయిదారులకు మౌఖికంగా చెప్తున్నా కానీ ఇంతవరకు టాక్స్ కట్టని సముదాయాలను సీజ్ చేసి మున్సిపాలిటీకి తరలించడం జరుగుతుందన్నారు.మున్సిపల్ శాఖ ఆస్తి పన్నుపై అధిక మొత్తంలో పెనాల్టీ పైన 90% మినహాయింపు ఇస్తున్నందున అందరూ ఉపయోగించుకొని పేరుకుపోయిన తమ ఆస్తి పన్నులను 90 శాతం మినయింపుతో సకాలంలో చెల్లించి లబ్ధి పొందాలన్నారు. అలాగే పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కట్ట స్వామి. తదితరులు పాల్గొన్నారు.
