పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ది సాధ్యం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస టాకీస్ మెయిన్ రోడ్ ప్రతి షాప్ కు వెళ్లి వ్యాపారస్తులకు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నుండి నన్ను ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడో సారి ఏర్పడటం పక్క అని పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు. గత పది సంవత్సరాల మోదీ పాలనలో భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అని అన్నారు. దేశంలో నిరు పేదల కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ పార్టీని ఆదరించి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి పురుషోత్తం, ముల్కల్ల మల్లా రెడ్డి, రజనీష్ జైన్, పురుషోత్తం జాజు, మున్న రాజ సిసోడియా, రంగ శ్రీశైలం, బోయుని హారి కృష్ణ, గోలి రాము, పబ్బతినేనీ కమలాకర్ రావు, మోటపలుకుల తిరుపతి, జోగుల శ్రీదేవి, కంకణాలు సతీష్, సత్రం రమేష్, ఆకుల సంతోష్, కషెట్టి నాగేశ్వర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు





