24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25)
తెలంగాణ:రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాబోయే 2-3 తేదీ లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి పూట పలు జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.రాత్రి పూట 26 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయని పేర్కొంది. గత కొన్ని రోజుల వ్యవధిలోనే 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడం గమనార్హం.
