రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం – కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.
బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో బాగంగా మంచిర్యాల పట్టణానికి వచ్చిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారాంటిల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే 6గ్యారాంటిల అమలు సాధ్యం అని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న 6 గ్యారాంటిల ఎప్పటి లాగా అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీకే స్పష్టత లేదని అన్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ పథకాల హమిలులను అమలు చేస్తామని ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. ఇటు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పి ఆర్టీసీ భూములను 99 సంవత్సరాలు లీజు కు ఇచ్చి ఆ భూములను దోచుకోవాలని చేస్తున్నారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్రమాలు జరిగాయని చెప్తున్నరే అన్న దానికి కారణమైన వారి పై ఎందుకు చర్యకు తీసుకోవటం లేదో తెలుపాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు సీబిఐ ఎంక్వైరీ చెపిస్తామని చెప్పి ఎప్పుడు ఎందుకు సీబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని తెలిపారు. మోదీ పది సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రపంచంలో భారత దేశానికి కీర్తి మోదీ పరిపాలన లోనే సాధ్యం అయిందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుంటమని అదే విధంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 80 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లే గంగా రెడ్డి, కొప్పు భాష, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రజనీష్ జైన్, రావుల రామ్ నాథ్, మున్న రాజ సిసోడియా, తుల ఆంజనేయులు, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్, బండి మల్లికార్జున్ మరియు తదితరులు పాల్గొన్నారు.






