Breaking News నేరాలు

కోడిగుడ్డు లేవ్వనందుకు సూపర్ మార్కెట్ యజమానిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు

399 Views

 

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గుండం జలపతి రెడ్డి దుమాల రోడ్డుకు జి మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండారం గ్రామానికి చెందిన నర్సింలు డేవిడ్ అనే ఇద్దరు వ్యక్తులు బీరు సీసాలతో షాపులోకి వచ్చి కోడిగుడ్లు ఉన్నాయా అని జలపతిని అడగగా లేవని జలపతి సమాధానం చెప్పగా నరసింహులు డేవిడ్ లు ఇద్దరూ జలపతిని నోటికి ఎంత వస్తే అంత బూతులు తిడుతూ బీరు సీసాలతో బెదిరిస్తూ అక్కడ ఉన్న పూల తొట్టి తనపై ఎత్తివేసి చంపుతామంటూ జలపతిని బెదిరియ్యగా జలపతి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా ఎల్లారెడ్డిపేట హౌస్ ఆఫీసర్ బి కిషన్ రావు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తెలిపారు

No Slide Found In Slider.

Poll not found