తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేసి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నారు.
అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని టిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బాల్క సుమన్ అని ప్రజల్లోకి వెళ్తున్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గడ్డం వివేక్ వెంకటస్వామి అవినీతి పాలనాంతం అందించాలి అనే నినాదంతో చెన్నూరు నియోజకవర్గం లో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అతి తక్కువ కాలంలోనె ప్రజలకు దగ్గరై వారి కష్టాలను తెలుసుకుంటూ, సమస్యలను పరిష్కరిస్తా అంటూ 30 తారీఖున జరిగే పోలింగ్ నాడు హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు నియోజకవర్గ ప్రజలను కోరారు.
