రాజకీయం

పెన్షన్ లు ఇంకెప్పుడిస్తారు…?

174 Views

–ఎమ్మెల్యే కు పట్టింపులేదా.?

–తిమ్మాపూర్ లో నిరసన తెలిపిన బీజేపీ నాయకులు..

(తిమ్మాపూర్ జూన్ 22)

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలలైనప్పటికీ పెన్షన్ లపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోకుండా ఇంకెప్పుడిస్తారని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ బీజేపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.వృద్దులు, వికలాంగులు, వితంతువులకు సంబందించిన పెన్షన్ లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ శనివారం బీజేపీ మండల శాఖ పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు. సుమారు గంటపాటుగా జరిగిన కార్యక్రమానంతరం ఎంపీడివో విజయ్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు.గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ లకు అదనంగా ఇస్తామని, పాతవి ఇవ్వకుండా కొత్తవాటికి అనుమతి ఇవ్వకుండా అర్హులైన వారిని ఇబ్బంది చేయడం చాలా దారుణమైన విషయమని అన్నారు.ప్రతీ నెలా వచ్చే పెన్షన్ ల మీద ఆదారపడే వారికి ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు విషయంలో భాద్యతగా ఉంటానని ఎన్నికల ముందు బాండ్ పేపర్ తో హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెన్షన్ ల విషయంపై లబ్ధిదారులకు సమాధానమివ్వాలని డిమాండ్ చేసారు. పెన్షన్ ల విషయంలో లబ్ధిదారులెదుర్కుంటున్న విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీడివో తో పేర్కొన్నారు.ప్రభుత్వం స్పందించని పక్షంలో పార్టీ తరపున మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

జిల్లా కార్యవర్గ సభ్యులు చింతం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, దళిత మోర్చా అధ్యక్షులు ఎల్కపల్లి స్వామి, ఓబీసి మోర్చా అధ్యక్షులు దుర్సెట్టి రమేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కంది రాజేందర్ రెడ్డి, నాయకులు ఉప్పులేటి జీవన్, ఎడ్ల భూంరెడ్డి,వీణవంక అంజయ్య, ఉప్పులేటి చిరంజీవి, కూన సంపత్, పట్నంశెట్టి ప్రణేష్, అరవింద్, పుట్ట ఓంకార్, సూద్దాల సతీష్, బూర్గు శ్రీనివాస్ రెడ్డి, కోరెపు లక్ష్మణ్, పెందోట అనంతచారి,అందె శేఖర్, అనిల్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
కొమ్మెర రాజు తిమ్మాపూర్