వర్గల్ మండల్, మార్చి 24, 24/7 తెలుగు న్యూస్ :మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ నియామకం.
నియామక పత్రాలు అందజేసిన డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి.
వర్గల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా గౌరారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గౌరారంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నర్సారెడ్డి నియామక పత్రాలు అందజేస్తూ వర్గల్ మండలంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, కాంగ్రెస్ నాయకులు తాల్ల భాను గౌడ్, పూదరి కర్ణాకర్ గౌడ్, గుండు నర్సింలు గౌడ్, నరేందర్ రెడ్డి, పొన్నాల నర్సారెడ్డి, నందు తదితరులు పాల్గొన్నారు.