ప్రాంతీయం

సాంస్కృతిక సాంప్రదాయాలు ఆచారాలు భావితరాలకు అందించాలి

102 Views

సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారములను భావితరాలకు అందివ్వాలి – ఎంపి అభ్యర్థి ఆత్రం.సక్కు.

కొమరం భీం జిల్లా

తిర్యాణి:- కుంరంభీము జిల్లా తీర్యాణి మండలంలోని తన సొంత గ్రామమైన లక్ష్మిపూర్ లో హోళీ కాముడి దహనం కార్యక్రమానికి హాజరైన ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చాందేకార్ ఆత్రం సక్కు హాజరై పుజాలు చేశారు.

ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను,ఆచార వ్యవహారాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు.కామ దహనం రోజున కుడక ఇస్తేనే గ్రామస్తుడిగా గుర్తిస్తారని ఈ హోళీ పండుగను పులరా,దురాడి పర్వదినంగా భావిస్తాము అని అన్నారు.

తరతరాల నుండి వస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారము లను భావి తరాలకు అందివ్వాలని అన్నారు.గ్రామ పొలిమేరలోనే కాముడి దహనం చేస్తారు అనంతరం కొందరు ఆ మంట నుండి దుకుతారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ నైతం రఘునాథ్, తాజ మాజీ సర్పంచ్ కుర్సెంగ బాధిరావు గ్రామస్థులు, తదితరులు ఉన్నారు.

 

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్