ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ రైతురుణమాఫీ కాంగ్రెస్ విజయమే అన్నారు. ఇన్ని రోజులుగా రైతుల ఖాతాలు ఫ్రిజ్ చేస్తూ పండించిన ధాన్యం డబ్బులుకూడా ఇవ్వకుండా బ్యాంకులు వేధిస్తుంటే కేసీఆర్ పట్టించుకోకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయాలని ఒక డెడ్ లైన్ పెట్టి ఆలోపు చేయకుంటే రైతులతో కలిసి బ్యాంక్ ల ముందు భారీ ఎత్తున ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరిస్తే ప్రభుత్వం దిగివచ్చి రైతు రుణమాఫీ చేశారన్నారు. ఎలక్షన్ల ముందు రైతులకు కల్లబొల్లి మాటలు చెబుతూ మోసపూరితమైన హామీలు ఇస్తున్నారని అన్నారు. ఒకవేళ కెసిఆర్ కి రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీ ద్వారా ఇచ్చిన పనిముట్లను ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అన్నారు. కేవలం ఇది ఎలక్షన్ స్టంట్ మాత్రమేనని ఆరోపించారు. ఈరుణమాఫీని కూడా నెలన్నర లోపు చేస్తామంటున్నారు కానీ సంభవమా అసంబవమా అన్నారు. ఏదిఏమైనా వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానె ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారని రాబోయే కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, నిమ్మరవి, ధీటి నర్సింలు ఆరుట్ల మహేష్ రెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, మాధాసు అనిల్, మామిండ్ల ఆంజనేయులు, శీలం రాజనర్సు, రంజాన్ నరేష్, తాళ్ల విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
