పెద్దపల్లి, మార్చి 23, 24/7 తెలుగు న్యూస్ :విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుండి ఘనంగా మెట్రో న్యూస్ రిపోర్టర్ ఎల్లోజూ జన్మదిన వేడుకలు.
పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి. గ్రామా నికి చెందిన మెట్రో న్యూస్ రిపోర్టర్ ఎల్లోజూ అరవింద్ చారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..
పెద్దకొత్తపల్లి మండల సమీపంలోని గంట్రావుపల్లి.గ్రామంలో ఎల్లోజూ అరవింద్ చారి జన్మదిన వేడుకలను విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎల్లోజూ ప్రసాద్ చారి ఉపాధ్యక్షులు నారాయణదాసు బిచ్చయ్య చారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా ఎల్లోజూ అరవింద్ చారి మాట్లాడుతూ అమరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు, దేశ రక్షణకై పోరాటం చేసి నేటికి 93 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి వారి ప్రాణాలను దేశం కోసం దేశ ప్రజల కోసం తమ దేహాలను ఉరి తాళ్లను సైతం ఉయ్యాలలుగా భావించిన రోజు కాబట్టి వారికి ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో
వారితోపాటుగా రఘుప్రోలు భవాని చారి వెంకటేశ్వర చారి గజేంద్ర చారి కరుణాకర్ చారి శ్రీనివాస్ చారి ప్రింట్ మీడియా సభ్యులు ఈనాడు గోపాల్ రావు, నవ తెలంగాణ భాను ప్రకాష్, ఆంధ్రజ్యోతి పిల్లి కృష్ణయ్య విలేకరులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది