Breaking News

యూనివర్సిటి ప్రకటించాలి

120 Views

సీఎం సిద్దిపేటకు ప్రభుత్వ యూనివర్సిటి ప్రకటించాలి.

ఈ అంశం పై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి.

అక్టోబర్ 17

సిద్దిపేటలో ప్రభుత్వ యూనివర్సిటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ యూనివర్సిటి సాధనోధ్యమ కమిటీ అధ్వర్యంలో ప్రొ జయశంకర్ విగ్రహం ఎదుట కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎ.బాబురావు,పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ సిద్దిపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రభుత్వ యూనివర్సిటి స్వరాష్ట్రంలో కూడా నెలకొల్పకపోవడం యూనివర్సిటిబాధాకరం అన్నారు.సిద్దిపేటలో ప్రతి సంవత్సరం ఐదు వేల పైచిలుకు విద్యార్థులు తమ డిగ్రీలను పూర్తి చేస్తున్నారని,ఈ ప్రాంతంలో ప్రభుత్వ యూనివర్సిటి అందుబాటులో లేకపోవడం వల్ల వేలాదిమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను దూర ప్రాంతాలకు వెళ్లి చదవలేక మధ్యలోనే చదువులను ఆపివేస్తున్నారని ఆరోపించారు.

కామారెడ్డి,మెదక్,సంగారెడ్డి,జనగాం,యాదాద్రి,సిరిసిల్ల,కరీంనగర్ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉందని ఇప్పటికే ఈ జిల్లాల విద్యార్థులు డిగ్రీ&పిజిలు ఇక్కడే చేస్తున్నారని కాబట్టి ప్రభుత్వ యూనివర్శిటీ నెలకొల్పడం వల్ల చుట్టూ పక్కల జిల్లాల వారందరూ ఉన్నత విద్యవంతులుగా తయారు అవుతారని,నూతన ఆవిష్కరణలు,పరిశోధనలు జరుగుతాయని తెలిపారు.ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలోనే ఎర్నేని సీతాదేవి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే సిద్దిపేటలో మినీ యూనివర్సిటీ ఏర్పాటుకోసం తొంబై ఎకరాలకు పైగా భూమిని ఇర్కొడ్ లో కేటాయించారని గుర్తు చేశారు.అదే విధంగా ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెగ్గు మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సిద్దిపేట ప్రాంతంలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని,తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశం పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షుడు అనిల్,పీ.డీ.ఎస్.యు పట్టణ కార్యదర్శి హిమవంత్ ,ట్రస్మా నాయకుడు సంతోష్,న్యాయవాదులు కొంపెల్లి విజయ్ కుమార్ ,బైరి ప్రవీణ్, ఐరేని రాజ్ కుమార్,పునెందర్,శివ మరియు పీడీఎస్.యు నాయకులు వంశీ,తిరుపతి,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *