Breaking News

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

134 Views

బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా మార్చి 22

పెద్ద కొడప్గల్ మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపి పార్టీలకు చెందిన 217 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కనీసం నియోజకవర్గంలో తాగు నీటి సమస్యను కూడా పరిష్కరించ లేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. గత పది సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసిన బిబి పాటిల్ ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుపాలని, ఎంపీ బిబి పాటిల్ కి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు నాగిరెడ్డి, మోహన్, శామప్ప, సంజీవ్, మల్లప్ప పటేల్, మొగుల గౌడ్, పండరి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్