మామిoడ్ల నర్సమ్మ
స్మారకార్థం నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు…

మామిండ్ల నర్సమ్మ స్మారకార్థం ఆమె తనయుడు , వర్గల్ జడ్పిటిసి సభ్యులు బాలు యాదవ్ మండలంలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పేర్కోన్నారు . శుక్రవారం గుoటిపల్లిలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ హనుమంతు , జడ్పిటిసి బాలు యాదవ్ తో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జడ్పిటిసి బాలు యాదవ్ చేయూత నివ్వడం ప్రశంసనీయమని కొనియాడారు . కలుషిత నీటితో గ్రామీణ ప్రజలు వ్యాధుల బారిన పడుతుండగా , ఇక అలాంటి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ధ్యేయంతో ముందడుగు వేయడం మంచి పరిణామమని తెలిపారు . ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు , అభివృద్ధికి నోచని కాలనీలు , దళిత , గిరిజనులు నివసించే ప్రాంతాలు లక్ష్యంగా నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు . త్వరలోనే వర్గల్ మండల కేంద్రంలో మరో నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తుండగా , విడతల వారీగా మండలంలో అవసరమైన చోట నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు చేపట్టనున్నట్లు వివరించారు . ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ బాల్రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు వేలూరి వెంకట్ రెడ్డి , ప్యాక్స్ ఛైర్మెన్ రామకృష్ణారెడ్డి , మండల రైతు బంధు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , పార్టీ నేతలు యాదగిరి గౌడ్ , నాగరాజు , మురళి గౌడ్ , స్వామి , వీరాగౌడ్ తదితరులు పాల్గొన్నారు .




