సక్రుబీమ్లా తండాలో పోషణ పక్వాడ కార్యక్రమo
చిరుధాన్యల ప్రముఖ్యతపై తల్లులకు అవగాహనా
మెదక్ జిల్లా శివంపేట మండలం మార్చి 22
మండలంలోని సక్రుభీమ్లా తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ సీడీపీఓ ఆదేశాల మేరకు పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఐసీడీఎస్ సూపర్ వైసర్ సంతోష గర్భిణీలకు, బాలింతలకు చిరుధాన్యల ప్రముఖ్యాతపై, తీసుకోవాల్సిన పోషకాహరం గురించి అవగాహనా కల్పించడం జరిగినది.
తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండే పదార్థాలను తప్పకుండా తీసుకోవాలని సుంచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆటపాటలతో విద్యాబ్యాసం నేర్పించడం జరుగుతుందని చిన్నారుల తల్లులకు వివరించడం జరిగినది. అనంతరం తల్లులు, గర్భిణీలతో కలిసి పోషణ ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కవిత, ఎఎల్, ఎంఎస్సీ సభ్యులు, చిన్నారుల తల్లులు, తండావాసులు పాల్గొన్నారు.
