ముస్తాబాద్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలు అంగరంగ వైబవంగా నిర్వహించడం జరిగింది. ఈయన మొట్టమొదటి తెలుగు చక్రవర్తిగా గౌతమి పుత్ర శాతకర్ణి గా ప్రసిద్ధిచెందాడు.నవశక సృష్టికర్త ప్రథమ ఆంధ్ర మహాపాలకుడు ఈయన శేషుని అనుగ్రహం తో అయోధ్య లో కుమ్మరి ఇంట్లో జన్మించాడు.ఈయన శాలివాహన కుటుంబం లో జన్మించడం వారి అదృష్టంగా భావించారు.1076 జీవో ను అమలు చేయాలనీ కోరారు. శాలివాహన చక్రవర్తి జయంతి, వర్ధంతి లను ప్రభుత్వం జర్పించాలని కోరారు.కుమ్మర్ల కొరకై ప్రభుత్వం చేయూతనివ్వలన్నారు.అలాగే చట్టసభల్లో వారికీ ప్రాతినిత్యం కల్పించాలన్నారు.అలాగే కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ లేని యెడల కుమ్మర్లంతా రాష్ట్రమంతా ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి హేచ్చరించారు.ఈ కార్యక్రమం లో సంఘ సభ్యులు మరియు యువజన సభ్యులు పాల్గొన్నారు.
