(తిమ్మాపూర్ జనవరి 26)
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన రాసిన రాజ్యాంగ స్ఫూర్తినీ స్మరించుకున్నారు..
అనంతరం మండల అధ్యక్షులు
పారునంది జలపతి మాట్లాడుతూ.
బ్రిటిష్ బానిస సంకెల నుండి విముక్తి పొంది దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులను కల్పించింది. అంతే కాకుండా స్వతంత్ర పోరాటంలో ఎందరో త్యాగదనులు ప్రాణ త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సంపాదించుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకొని స్వేచ్ఛ, స్వతంత్రంన్ని మనమందరం అనుభవిస్తున్నాం, అంతే కాకుండా రాజ్యాంగం చేత దేశంలో ప్రతి పౌరుడు కుల,మత,వర్గ ప్రాంతం,లింగ భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించారు..
దేశ ప్రజలకు హక్కులు కల్పిస్తూ ఎన్నో చట్టాలను రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఈ దేశం ఎల్లపుడూ రుణపడి ఉంటదని తెలియజేస్తూ ఈ రాజ్యాంగం ద్వారానే భారత దేశంలోని ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వాలు లభించయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కోయాడ మురళి, మండల ఉపాధ్యక్షులు తుర్పటి అజయ్,నాయకులు వేల్పుల ఒదయ్య యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కిన్నెర అంజి, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గంధం రాజు,గ్రామ శాఖ ఉపాధ్యక్షులు అల్వాల కుమార్, కళ్లెం బాలస్వామి ఇనుకొండ సంపత్,మండల నాయకులు కిన్నెర బాలస్వామి,అల్వాల సురేష్, ఉబీది అంజయ్య, అల్వాల చందు, గంధం శ్రీను తదితరులు పాల్గొన్నారు.