రాజకీయం

సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం..

177 Views

(తిమ్మాపూర్ మార్చి 22)

తిమ్మాపురం మండలం గొల్లపల్లి గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నుండి 5 లక్షల నిధుల తో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టి కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జంగా రామకృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ, గ్రామ ప్రధాన కార్యదర్శి నీలం ఆది రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేల్పుల మధు యాదవ్, సాయిల రజనీకాంత్,గుంటి శివ, సాయిల బాలయ్య తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
కొమ్మెర రాజు తిమ్మాపూర్