పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యల గురించి ప్రభుత్వానికి వినతిపత్రం
సిద్దిపేట్ జిల్లా జూన్ 10
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పూర్తి చేయించాలని కోరుతూ ఆర్డిఓ ఆఫీస్ డిటి దేవేంద్ర కి వినతి పత్రాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.
పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పాలన ప్రభుత్వం వెంటనే పూర్తి చేయించాలి హుస్నాబాద్ పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదల కోసం గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ పథకం ద్వారా అర్హులను గుర్తించి లబ్ధిదారులకు కేటాయింపులు చేయడం జరిగింది కానీ డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు పెండింగ్లో ఉండడం వలన లబ్ధిదారు డబుల్ బెడ్ రూమ్ లోకి వెళ్ళడానికి కష్టంగా తయారయింది అనేకమంది నిరుపేదలు నివసించడానికి ఇంటి అద్దెలు కట్టుకోవడానికి అవస్థలు పడుతున్నారు.
ఇల్లు లేని నిరుపేదలు కొండంత ఆశతో సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్నారు కావున స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు నిరుపేదల కష్టాలు పట్టించుకోని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులను పూర్తి చేయించి లబ్ధిదారులను ఆదుకోవాలని కోరుతున్నాంలేకుంటే రానున్న రోజుల్లో ఇల్లు లేని నిరుపేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము అని తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి కౌన్సిలర్ బొజ్జ హరీష్ బత్తుల జీవన్ కందుకూరి సతీష్ జేరిపోతుల సునీత పున్న లక్ష్మి పాల్గొన్నారు
